శంకర్పల్లి, జూలై 16: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో హత్య చేయించిన ఘటన శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం పీఎస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, శంకర్పల్లి ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్టౌన్కు చెందిన ఎరుకల శంకరయ్య(43) తన భార్య యశోదతో కలిసి సంగారెడ్డి జిల్లా బీరంగూడకు 14 ఏండ్ల క్రితం వలసొచ్చి పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా బీరంగూడలోని మజిల్ టెక్ టోన్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న ఏపీలోని విజయనగరానికి చెందిన తిరుపతిరావు(24)తో ఆమెకు పరిచ యం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె తన భర్తను చంపేయాలని ప్రియు డికి చెప్పింది. ఈ నెల 11వ తేదీన మండలంలోని టంగటూర్ గ్రామ శివారులోని దానిమ్మతోటకు శంకరయ్య బైక్‌పై వచ్చిన విషయాన్ని ఆమె తిరుపతిరావుకు తెలిపింది.
దీంతో అతడు తన ద్విచక్ర వాహనంపై శంకరయ్యను వెంబడించి టంగటూర్ గ్రామ శివారులో తలపై కర్రతో కొట్టడంతో అతడు బైక్‌పై నుంచి కింద పడిపోగానే తిరుపతిరావు తన వెంట తెచ్చుకున్న కత్తితో శంకరయ్య గొంతుకోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
బీరంగూడ నుంచి టంగటూర్ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా… ప్రియురాలి ఆదేశాల మేరకే హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నా డు. మృతుడి భార్య, తిరుపతిరావును అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు సెల్ఫోన్లు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ మహే శ్, ఎస్ఐలు కృష్ణ, సంతోష్‌రెడ్డి, కానిస్టేబుళ్లు అంజ య్య, రమాకాంత్, మహేందర్‌రెడ్డి, మల్లేశ్, ధర్మారెడ్డి, రామినాయుడు, సాయికుమార్, బాల్‌రాజ్‌లను ఏసీపీ రవీందర్‌రెడ్డి అభినందించారు.