పరిగి, జూలై 15: గ్రాంటుగా రూ.10లక్షలు అందజేసే ఏకైక పథకం దళితబంధు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలో చౌడాపూర్ గ్రామానికి చెందిన పరిగి శ్రీను, దోమ మండలం మల్లేపల్లికి చెందిన నెత్తి ఈశ్వర్‌కు దళితబంధు పథకం కింద మంజూరైన ట్రాక్టర్లను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ది సాధించాలనే సంకల్పంతో ప్రభు త్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఇన్నాళ్లు వివిధ పనులు చేపట్టిన వారందరూ నేడు ఆయా రంగాల్లో ఏర్పాటు చేసే యూనిట్ల ద్వారా యజమానులుగా మారారని తెలిపారు. ఈ సంవత్సరం నియోజకవర్గానికి 1500 యూనిట్లు మంజూర య్యాయని, త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.రూ. 10లక్షలతో ఒక యూనిట్ లేదా ఎక్కువ యూనిట్లు ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. లబ్దిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో పరిగి, కులకచర్ల ఎంపీపీలు కె.అరవిందరావు, సత్యమ్మ, కులకచర్ల జడ్పీటీసీ రాందాస్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుం దర్‌రెడ్డి, పరిగి, కులకచర్ల పిఎసిఎస్‌ల వైస్ చైర్మన్లు ఎస్. భాస్కర్, నాగరాజు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజ నేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలి
కులకచర్ల, జూలై 15 : ఆశకార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆశకార్యర్తలకు యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులకచర్ల దవాఖానకు ప్రహరీ నిర్మాణం మంజూరైందని త్వరలో పనులు ప్రారంభిస్తారన్నారు. కులకచర్ల మండలంలో కుస్మస ముద్రం, చౌడాపూర్ మండలంలో మందిపల్, మరికల్ గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.
చౌడాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుం టున్నామని అన్నారు. అలాగే కులకచర్ల మండల కేంద్రంలో మురుగునీటి కాల్వల నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ నాగరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, సర్పంచ్ సౌమ్యా వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ ఆనందం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, నాయకులు రఘు, మాలు కృష్ణగౌడ్, వెంకటయ్యగౌడ్, మొగులయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, రామచంద్రయ్య, మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్‌వో చంద్రప్రకాశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.