కడ్తాల్, జూలై 15: రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. చరికొండ గ్రామానికి చెందిన మల్లేశ్‌కి రూ.60 వేలు, ముద్విన్ గ్రామానికి చెందిన నర్సింహా రూ.38 వేలు, పల్లెచెల్కతండాకి చెందిన నవీన్ రూ.30వేలు, మక్తమాదారానికి చెందిన హరీశ్ రూ.24 వేలు, ఏక్వాయిపల్లికి చెందిన గోపమ్మకు రూ.20వేలు, మల్లేశ్‌కు రూ.9 వేలు, కడ్తాల్‌కు చెందిన వెంకటేశ్ రూ.19వేలు, పెద్దారెడ్డిచెరువు తండాకు చెందిన మంగ్యానాయక్ రూ.18 వేలు, మర్రిపల్లికి చెందిన శివ రూ.16వేలు, వాసుదేవ్పూర్కు చెందిన రాజేశ్వరికు రూ.14వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ ఫలాలు అన్ని వర్గాలకు అందజేయడానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాలను మానుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యపు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరించి అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు.
కేంద్రానికి తెలంగాణ నుంచి జీఎస్టీ రూపంలో రూ.3 లక్షల కోట్లు వెళితే, తిరిగి తెలంగాణకు కేవలం రూ.1.25 కోట్లు కేటాయించిందని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్‌లు కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, హంశ్యమోత్యానాయక్, సులోచన, భాగ్యమ్మ, యాదయ్య, భారతమ్మ, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, ప్రియ, రమేశ్, మంజుల, చంద్రమౌళి, ఉప సర్పంచ్ రామకృష్ణ, వెంకటేశ్, నాయకులు గంప శ్రీను, వీరయ్య, నారాయణ, సాయిలు, లాయక్‌అలీ, బాలకృష్ణ, అశోక్, జంగయ్య, సాబేర్, హరీశ్‌గౌడ్, భూమయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.