నందిగామ, జూలై 15 : దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలం గూడురు గ్రామానికి చెందిన అశోక్‌కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్‌తో కలిసి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంతో దళితులు అర్థికంగా అభివృద్ధి చెంది, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండె కృష్ణ, చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ పద్మారావు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, వీరేందర్‌గౌడ్, నర్సింహ, ఆంజనేయులు పాల్గొన్నారు.
రూ.3లక్షల ఎల్వోసీ అందజేత..
నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన డి.నర్సింహ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా వీరికి రూ.3లక్షలు మంజూరు కాగా, ఇందుకు సంబంధించిన ఎల్వోసీని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, సర్పంచ్ నర్సింలుతో కలిసి అందజేశారు.
హైమాస్ట్ లైట్లతో మరింత సుందరంగా
షాద్‌నగర్‌టౌన్, జూలై 15: షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ప్రధానదారుల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 20వార్డు శివాజీ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్స్‌ను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు కొందూటి మహేశ్వరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా వార్డుల్లో నూతన సీసీరోడ్లు, అంతర్గత మురుగుకాలువలు, వీధి దీపాలు, ఇంటింటికీ మిషన్‌భగీరథ నల్లాలతో పాటు ప్రధాన దారుల్లో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు.
మున్సిపాలిటీని మరింత సుందరంగా మార్చేడమే లక్ష్యంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అదే విధంగా మున్సిపాలిటీలోని న్యూసిటీకాలనీ, ఈద్గా సమీపంలో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, అంతయ్య, సర్వర్‌పాషా, శ్రీనివాస్, లతాశ్రీ, ప్రేమలత, నాయకులు యుగేందర్, జూపల్లి శంకర్, సత్యనారాయణ, భిక్షపతి, అశోక్, రాజశేఖర్, శ్రీకాంత్, అనుప్, గోపాల్, శరత్, అరె కటిక సంఘం నాయకులు శంకర్ పాల్గొన్నారు.