తాండూరు, జూలై 10: త్యాగానికి ప్రతీకగా సల్లేలాహు ఆలైవలంను స్మరించుకునేందుకు నిర్వహించే బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజ నియోజకవర్గాలోని అన్ని మండలాల్లోని ముస్లింలు నూతన వస్ర్తాలు ధరించి ఈద్గా, మసీద్‌ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు పట్టణ శివారులోని చెన్గేష్పూరు మార్గంలో ఉన్న ఈద్గాలో అధిక సంఖ్యలో ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్ బోధ నలను, బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ త్యాగ గుణాన్ని అల వర్చు కోవాలని సూచించారు. ప్రార్థనల అనంతరం చిన్నా పెద్దా తేడా లేకుండా ఈద్ ముబారక్ చెప్పుకొన్నారు. ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన (ఈద్-ఉల్-జుహా)లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేశ్‌తో పాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు ముస్లింలను ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు పెద్ద పీట వేసిం దన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముస్లింలకు ప్రత్యేక సౌకర్యాలు, పథకాలు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. తాండూరు ఈద్గా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉంటూ మత సామరస్యాన్ని చాటాలన్నారు. ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ అందరి దైవం ఒక్కటేనని అందరం కలిసికట్టుగా ఉంటూ వ్యక్తిగత అభి వృద్ధితో పాటు సమసమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు