రంగారెడ్డి, జూలై 8(నమస్తే తెలంగాణ): అల్పపీడన ప్రభావంతో రంగారెడ్డి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిం ది. అత్యధికంగా యాచారం మండలంలో 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, కందుకూరు మండలంలో 48.7 మి.మీటర్లు, ఆమనగల్లులో 46.7 మి.మీ, మహేశ్వరంలో 46.6 మి.మీ, మంచాలలో 42.6 మి.మీ, నందిగామలో 44 మి.మీ, కొందుర్గులో 42.2 మి.మీ, కొత్తూరులో 36.9 మి.మీ, షాబాద్‌లో 35.8 మి.మీ, కేశంపేటలో 32.1 మి.మీ, ఫరూఖ్‌నగర్‌లో 29.8 మి.మీ, చౌదరిగూడెంలో 26.3 మి.మీ, మాడ్గులలో 24.1 మి.మీ, శంషాబాద్‌లో 23 మి.మీ, చేవెళ్లలో 15.9 మి.మీ, కడ్తాల్ లో 17.3 మి.మీ, ఇబ్రహీంపట్నంలో 16.1 మి.మీ, బాలాపూర్‌లో 16 మి.మీ, శంకర్‌పల్లిలో 10.6 మి.మీ, మొయినాబాద్ మండలంలో 6.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అదేవిధంగా గ్రామాలవారీగా నమోదైన వర్షపాతానికి సంబంధించి… యాచారం మండలంలోని గున్గల్ గ్రామంలో 6.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేటలో 5.9 సెం.మీటర్లు, మంచాల మండలంలోని బోడకొండలో 5.5 సెం.మీటర్లు, మహేశ్వరం మండలంలోని అమీర్‌పేటలో 5.3 సెం.మీటర్లు, కందుకూరు మండలంలోని రాచలూరులో 5.3 సెం.మీట ర్లు, తలకొండపల్లి మండలంలోని వెల్జాల్లో 5.2 సెం.మీటర్లు, ఆమనగల్లులో 5 సెం.మీటర్లు, యాచారంలోని నల్లవెల్లిలో 4.8 సెం.మీటర్లు, యాచారంలో 4.8 సెం.మీ టర్లు, తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో 4.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం
పరిగి, జూలై 8: వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురువగా.. శుక్రవారం చిరుజల్లులు పడ్డాయి. మర్పల్లిలో 4.7మిల్లీమీటర్లు, మోమిన్‌పేటలో 16.4 మి.మీ, నవాబుపేటలో 9.6 మి.మీ, వికారాబాద్‌లో 31.4 మి.మీ, పూడూరులో 28.3 మి.మీ, పరిగిలో 33.2 మి.మీ, కులకచర్లలో 45.9 మి.మీ, దోమలో 48 మి.మీ, బొంరాస్‌పేటలో 49 మి.మీ, ధారూరులో 38 మి.మీ, కోట్‌పల్లిలో 31.8 మి.మీ, బంట్వారంలో 19.1 మి.మీ, పెద్దేముల్లో 34.9 మి.మీ, తాండూరులో 45.6 మి.మీ, బషీరాబాద్‌లో 46.6 మి.మీ, యాలాలలో 49.8 మి.మీ, కొడంగల్‌లో 53.9 మి.మీ, దౌల్తాబాద్‌లో 49.2 మి.మీ, చౌడాపూర్‌లో 17మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.