కొడంగల్, జూలై 6: పేదలకు కార్పొరేట్ వైద్య సదుపాయాలను అందించే దిశగా సర్కారు ప్రభుత్వ దవాఖానాలను ఆధునీకరిస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సీహెచ్‌సీ 50 పడకల దవాఖానలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్‌తో కలిసి రోగులకు ఉచిత భోజన సదుపాయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో ప్రభుత్వ దవాఖాన అంటే భయపడే ప్రజలు నేడు సర్కారు దవాఖాల్లోనే నాణ్యమైన వైద్యం అందుతున్నట్లు గుర్తిస్తున్నారన్నారు. దీంతో రోజురోజుకు సర్కారు దవాఖానాల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపారు. కొడంగల్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఉచిత భోజన సదుపాయాన్ని ప్రా రంభించామని, ఉదయం పాలతో పాటు మధ్యాహ్నం, రాత్రి రెండు పూట లా ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత భోజన సదుపాయంపై రోగులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దవాఖానలో నెలకొన్న సమస్యలపై డాక్టర్లతో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూన్యాదవ్, రమేశ్, డాక్టర్లు మూర్తి, వీణ, శ్రావణి సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ప్రమాదఘటనపై ఎమ్మెల్యే ఆరా
కొడంగల్, జులై 6: బుధవారం అంగడిరైచూర్ సమీపంలో వాహనం ఢీ కొని యువ కుడు మృతి చెందాడు. అదే సమయంలో దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రా మంలో మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళుతున్న ఎమ్మెల్యే పట్నం నరేం దర్‌రెడ్డి ప్రమాద ఘటనపై ఆరా తీశాడు. అప్పటికే యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అంబులెన్స్‌కు ఫోన్‌చేసి మృతదేహాన్ని కొడంగల్ దవాఖానకు తరలించే ఏర్పాట్లు చేశారు. మృతుడు దౌల్తాబాద్ మండలంలోని బిచ్చాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ సోదరుడి కుమారుడుగా గుర్తించారు.
పేదలముఖాల్లో చిరునవ్వులు
దౌల్తాబాద్ జూలై 6: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన దళితబంధు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా, రైతు బంధు పథకాలతో పేదల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా దౌల్తాబాద్ మండల కేంద్రంతో పాటు బాలంపేట, చంద్రకల్, ఇముడాపూర్ గ్రామాల్లో బుధవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. అనంతరం జడ్పీహైస్కూల్లో మొక్కలు నాటి పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుకున్నారు.అనంతరం దౌల్తాబాద్ మండల కేంద్రంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మద్దూర్, దౌల్తాబాద్ మండలాలలోని నిడ్జింత, గోఖఫస్లవాద్, దౌల్తాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, డిప్యూటీ ఎమ్మార్వో చాంద్‌పాషా, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ బాయిరెడ్డి నరోత్తంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్‌రావు, మండల కో ఆప్షన్ సభ్యుడు జకీర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మల్లేశం, సర్పంచు శిరీష, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు పాల్గొన్నారు.