ఆర్కేపురం, జూలై 3: ప్రధాని మోదీకి సరైన పోటీదారు సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్ కిన్నెర (స్వాగత్) ఫంక్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం డివిజన్ మాజీ అధ్యక్షుడు అరవింద్‌శర్మ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విజయ సంకల్ప సభ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ నగరాన్ని డైనమిక్ సిటీగా కితాబిచ్చి నట్లు తెలిపారు. దీనికి కారణం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేపట్టిన అభివృద్ధేనని అన్నారు.
ప్రధాని మోదీ తెలంగాణ రాష్ర్టానికి ఏమి ఇచ్చారనే విషయాన్ని బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేని సం క్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుందని కొనియాడారు. మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని.. గ్రూపు రాజకీయాలకు తావులేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.
అనంతరం రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న దన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాండురంగారెడ్డి, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, మీర్‌పేట మేయర్ దుర్గ, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, జయేందర్, రాజూనాయక్, లక్ష్మయ్య, అఫ్జల్, రాంరెడ్డి, నగేశ్, చంద్రయ్య, జిల్లెల కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, రామాచారి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, శేఖర్, జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్, అంకిరెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.