తాండూరు, జూన్ 27: తన భార్య అదృశ్యం కేసును 48 గంటల్లో ఛేదించాలని పోలీసులకు గడువు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యమూర్తి, ఇద్దరు పిల్లలను సోమవారం వారణాసిలో తాండూరు పోలీసులు పట్టుకున్నారు. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ (36) మూడు నెలల క్రితం అదృశ్యమైనా ఆమె ఆచూకీని పోలీసులు కనిపెట్టడం లేదని మనస్తాపం చెందిన సత్యమూర్తి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రెండు రోజుల్లోగా తన భార్య ఆచూకీని తెలపకపోతే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని శనివారం సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సెల్ఫీ వీడి యో పోస్టు అనంతరం సత్యమూర్తి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎటు వెళ్లారో అనే కోణంలో పోలీసులు పూర్తి విచారణ చేపట్టారు. తాండూరు-పరిగి మీదుగా వారు కారులో శంషాబా ద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు గుర్తించారు.
కారును అక్కడ పార్కు చేసి ముంబై, అక్కడి నుంచి వారణాసి, కాశీకి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలతోపాటు వాహనాల గుర్తింపుతో సత్యమూర్తి ఉన్న లాడ్జి కి వెళ్లారు. అక్కడ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అతడు క్షేమంగా ఉండటంతో సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకుని తాండూరుకు తీసుకొచ్చే ఏర్పా ట్లు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్ ధ్రువీకరించారు. సత్యమూర్తి జాడ తెలియడంతో బంధు,మిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు తాండూరులోని సత్యమూర్తి ఇంట్లో ఉన్న ఐదు సెల్ఫోన్లు, పది పెన్‌డ్రైవ్‌లతోపాటు సత్యమూ ర్తి రాసిన పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపా రు. అన్నపూర్ణ అదృశ్యంపై విచారణను మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు.