ఇబ్రహీంపట్నం, జూన్ 26 : ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఎంకేఆర్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్న ప్రతి అభ్యర్థీ కష్టపడాలని టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఎంకేఆర్ ఫౌండేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ పొందుతున్న 750 మందికి ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను ఆయన ఆదివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా గతంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గం నుంచి అత్యధిక మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. ఈసారి కూడా ఇబ్రహీంపట్నం ప్రాంతం నుంచే ఎక్కువమంది పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు కష్టపడి చదవాలని ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాల్లో పుట్టిన ఎంతోమందికి నేడు ఈ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నదని తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ అందించి ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించి ఆ నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఫౌండేషన్ వెన్నంటే ఉంటుందన్నారు. పోలీస్ కానిస్టేబుల్ శిక్షణతో పాటు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్ంయంలో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంకేఆర్ ఫౌండేషన్ కార్యదర్శి జెర్కోని రాజు, శిక్షకులు వెంకటేశ్, నరేశ్, ఫౌండేషన్ సభ్యులు మైలారం విజయ్‌కుమార్, నాని, పవన్, శ్రావణ్, ఆనంద్, భగీరథ్సాగర్, విజయ్, రాజేశ్, శివారెడ్డి, మనీశ్‌రెడ్డి, అక్రమ్ ఉన్నారు.