పెద్దేముల్, జూన్ 25 : మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని ఆరోగ్యలక్ష్మి కమిటీ మీటింగ్లు అన్ని కేంద్రాల అంగన్వాడీ టీచర్లు తప్పకుండా నిర్వహించాలని అంగన్వాడీ సూపర్వైజర్ దశమ్మ అన్నారు. శనివారం మండల పరిధిలోని ఆత్కూర్ గ్రామంలోగల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్ వైజర్ దశమ్మ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని అంగన్వాడీ టీచర్లు కొత్తగా విద్యార్థుల నమోదును చేపట్టాలని,ప్రతి ఒక్కరూ సర్వే రిజిస్టర్లలో మార్పు, చేర్పులు తప్పకుండా చేపట్టాలని అన్నారు.
ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 11 మంది తల్లులతో ఏర్పాటు చేసుకొన్న ‘ఆరోగ్య లక్ష్మి కమిటీ’ మీటింగ్లను నిర్వహించుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులకు క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలను పంపించాలని సూచించారు. అంతకుముందు తనిఖీల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో కొత్త విద్యార్థుల నమోదు జరుగుతుందా? లేదా? సర్వే రిజిస్టర్ రాస్తున్నారా ? లేదా? ఆరోగ్య లక్ష్మి కమిటీ మీటింగులు పెడుతున్నారా? లేదా? విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతున్నారు? అనే విషయాలతోపాటు పలు రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట ఆత్కూర్ అంగన్వాడీ టీచర్లక్ష్మి, విద్యార్థులు ఉన్నారు.