కులకచర్ల, జూన్ 20: వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సకాలంలో పంటలకు నీరు అందక ఎండిపోయి ఆర్థికంగా చితికిపోతున్న గిరిజన రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం గిరివికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గిరిజన రైతులు వారి భూముల్లో పంటలు పండించుకునేందుకు వీలుగా బోర్లను ఉచితంగా వేయించి విద్యుత్ కనెక్షన్ ఇప్పించి మోటరు ను బిగించి అధికారులు ఇస్తారు. అంతేకాకుం డా ఇద్దరు నుంచి ఆరుగురు రైతులు ఒకేచోట ఆరు నుంచి పది ఎకరాల వరకు భూమిని కలిగి ఉంటే వారి పేరుతో సామూహికంగా బోరును కూడా ఉచితంగా వేయించడంతోపాటు విద్యుత్ కనెక్షన్ ఇప్పించడం, మోటరు ను బిగించడం వంటి పనులను పూర్తిగా వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
బోరుకు సమీపంలోనే ఇంకుడు గుంతలను తవ్వించడంతోపాటు మొక్కల పెంపకం, పశువులకు నీళ్లు, మేకల పాక, కం పోస్ట్టు పిట్లను తవ్వేందుకు ఉపాధిహామీ పథ కం ద్వారా నిధులను అధికారులు మంజూరు చేస్తారు. ఫలితంగా గిరిజన రైతులకు అన్ని విధాలా లాభం చేకూరనున్నది. సీఎం గిరివికాసం పథకంలో బోర్లను వేయించుకోవాలనే ఆసక్తి ఉన్న రైతులు డీఆర్డీఏ/డ్వామా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమి నిబంధనల ప్రకారం ఉందని గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం ఉండాలి. గ్రూపు తీర్మానం, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, జాబ్‌కార్డు, భూమి ఉన్న స్థలాన్ని గుర్తిస్తూ లొకేషన్ మ్యాప్, ఎంపీడీవో, తహసీల్దార్లు దరఖాస్తులపై సంతకాలు చేసిన కాపీలను డీఆర్డీఏ/డ్వామా కార్యాలయానికి పంపించా లి. వాటిని పరిశీలించిన అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతుల భూమిలో బోరు పాయింట్‌ను గుర్తిస్తారు. అనంతరం భూగర్భజలశాఖ అధికారులు రైతుల పొలా ల్లో బోరు వేసే చర్యలను చేపడుతారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా బోర్లు వేయించి వారు వ్యవసాయరంగంలో రాణించేందుకు ప్రభుత్వం ఈ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నది.
10 ఎకరాలు ఉన్నఇద్దరు ఎస్టీ రైతులకు..
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వమే వందశాతం సబ్సిడీతో గిరిజనుల భూముల్లో బోర్ల ను వేయిస్తుంది. ఒక రైతుకు ఐదు ఎకరాలు.. మరో రైతుకు ఐదు ఎకరాలు మొత్తం కలిపి పది ఎకరాల భూమి ఒకే ప్రాంతంలో ఉంటే సామూహికంగా ఏర్పడిన రైతులకు ఈ పథ కం ద్వారా ప్రభుత్వమే బోరును వేయించి.. విద్యుత్ కనెక్షన్‌ను ఏర్పాటు చేయిస్తుంది.
మండలంలో మూడు బోర్ల బిగింపు..
కులకచర్ల మండలంలో సీఎం గిరివికాసం పథకం ద్వారా అధికారులు మూడు బోర్లను వేయించారు. సాల్వీడ్ గ్రామంలోని ఇద్దరు రైతుల పొలాల్లో.. అనంతసాగర్‌లో ఒక గిరిజన రైతు పొలంలో బోర్లను బిగించి.. విద్యుత్ కనెక్షన్ ఇప్పించారు.
గిరిజన రైతులకు మాత్రమే ..
గిరిజనులకు సంబంధించిన వ్యవసాయ భూ ముల్లోనే ప్రభుత్వం సీఎం గిరివికాసం పథ కం ద్వారా బోరును వేయించడంతోపాటు ఉచితంగా విద్యుత్ కనెక్షన్‌ను ఇప్పించి బోరు మోటర్‌ను బిగించి ఇస్తుంది. ఈ పథకానికి లంబాడీలు, చెంచులు మాత్రమే అర్హులు.
లంబాడీలు, చెంచులు మాత్రమే అర్హులు
గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులు సామూహికంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది 10 ఎకరా లు ఉన్న రైతులు ఈ పథకాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి, అర్హులను గుర్తించి ఉచితంగా బోరును వేయించి విద్యుత్ కనెక్షన్‌ను ఇప్పిస్తుంది. ఈ పథకానికి లంబాడీలు, చెంచులు మాత్రమే అర్హులు.
–వెంకటేశ్, ఏపీవోఉపాధిహామీ పథకం కులకచర్ల