షాబాద్, జూన్ 20: తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడుల్లోనే చేర్పించాలని కక్కులూర్ సర్పంచ్ భానూరి మమతాజీవన్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని కక్కులూర్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కరుణాకర్, మాజీ ఎంపీటీసీ సుఖ్‌జీవన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవికాంత్, హెచ్ఎం రాజేశ్వరి, ఉపాధ్యాయురాలు రాధిక, విద్యాకమిటీ చైర్మన్ జంగయ్య, అంగన్వాడీ టీచర్లు నాగమణి, రత్నమాల, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ఇబ్రహీంపట్నం, జూన్ 20 : ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని ఆదిబట్ల మున్సిపల్ వైస్‌చైర్మన్ కోరె కళమ్మ అన్నారు. సోమవారం ఆదిబట్ల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.పరమేష్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం చేయించి మాట్లాడారు.
విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు అందజేత
విద్యార్థులకు ఉదయశ్రీ ఆధ్వర్యంలో బ్యాగులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లావణ్య పాండురంగారెడ్డి, ఉపాధ్యాయులు బుచ్చయ్య, బాబ్లీ, పద్మావతి, రామ్మోహన్, అశోక్, జంగయ్య, విజయలక్ష్మి పాల్గొన్నారు.