షాద్‌నగర్, జూన్20: బీజేపీ నేతలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకుల తీరును తీవ్రస్థాయిలో ఖండించారు. పక్కా ప్రణాళికతో మదన్మోహన్ అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యేను బదునాం చేసి, రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే స్వగ్రామం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామంలో చోటుచేసుకున్న భూ వివాదాన్ని ఎమ్మెల్యేకు అంటగట్టి సోషల్ మీడియా, పలు చానళ్లలో తప్పుడు ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు.
విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీలు ఖాజ ఇద్రీస్, మధుసూదన్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, రాంబాల్‌నాయక్, శ్రీశైలం, దామోదర్‌రెడ్డి, యుగేందర్, ప్రతాప్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శంకర్, అంతయ్య, నర్సింహ, లక్ష్మణ్‌నాయక్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంగౌడ్, ఎండీ ఎజాజ్ అడ్డు, జమృత్‌ఖాన్, శేఖర్, యాదగిరి, హసీఫ్ పాల్గొన్నారు.
కుట్ర కోణాన్ని సమగ్ర దర్యాప్తు చేయండి
షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్పై జరుగుతున్న కుట్ర కోణంపై శాఖపరమైన దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. విచారణ చేసి నిజాలను ప్రజలకు తెలుపాలని కోరారు.