బడంగ్‌పేట, జూన్ 19 : కొన్ని పువ్వులు అరుదుగా కనిపిస్తాయి. అలాంటి కోవకు చెందినవే ఆఫ్రికన్ పువ్వులు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ వెంకటగిరి కాలనీలో నివాసముండే థామస్ తన ఇంట్లో అరుదైన ఆఫ్రికాలో ఉండే స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ అనే పువ్వులను పెంచుతున్నారు. కొచ్చిన్(కేరళ) నుంచి ఈ పువ్వుల మొక్కలను తీసుకొచ్చారు. ఈ పువ్వులు సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూస్తాయి. ఈ మొక్క చాలా సున్నితంగా ఉంటుంది. ఈ పువ్వు మంచి సువాసన వెదజల్లుతుందని థామస్ తెలిపారు. 30 నుంచి 60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుందన్నారు. కుండీలే, తొట్లలో పెంచుకోవచ్చని ఆయన అంటున్నారు.