కులకచర్ల, జూన్ 19 : ఆడపిల్లల వివాహాలు చేయాలంటే గతంలో వారి తల్లిదండ్రులు అప్పులు తీసుకురావడమో లేదా ఉన్న భూమిలో కొంతమేరకు అమ్మి చేసేవారు. వివాహాల కోసం తల్లిదండ్రులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి వారికి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. దీంతో కొంతమంది సర్పంచులు, ప్రజాప్రతినిధులు తమవంతుగా తమ గ్రామ పంచా యతీ ఆధ్వర్యంలో గ్రామంలో ఆడపిల్లల వివాహాలు జరిగితే నిత్యావసర సరుకులు అం దించేందుకు నిర్ణయం చేసుకున్నారు. కులకచర్ల మండల పరిధిలోని పటెల్‌చెరువుతండా గ్రామ పంచాయతీ, అల్లాపూర్ గ్రామ పంచాయతీలో ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆయా గ్రామ సర్పంచులు చర్యలు తీసుకుంటున్నారు. ఆడ పిల్లల వివాహానికి 15లీటర్ల మంచి నూనె., క్వింటాల్ సోనా మసూరి బియ్యం, ఐదు కిలోల కందిపప్పు అందిస్తున్నారు. గ్రామాల్లో ఆడపిల్లలకు సంబంధించి ఎవరి వివాహాం అయినా ఆయా వస్తువులను అందిస్తూ గ్రామాల ప్రజల మన్ననలు పొందుతున్నారు ఆయా గ్రామాల సర్పంచులు. పటెల్‌చెరువుతండా, అల్లాపూర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు స్వచ్ఛందంగా క్వింటాల్ బియ్యం, 15 కిలోల మంచినూనె ఐదు కిలోల కందిపప్పును అందించేందుకు నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు గ్రామంలో ఆడపిల్లల వివాహం జరిగితే వారి ఇంటికి వెళ్లి వస్తువులను అందజేస్తున్నారు. పదవీ కాలం ముగిసేవరకు ఈ సాయం అందిస్తామని ఆగ్రామాల సర్పంచులు పేర్కొంటున్నారు.
ఆనందంగా ఉంది..
ఆడపిల్లల వివాహానికి తమ గ్రా మంలో నిత్యావసర సరుకులు అందించేందుకు నిర్ణయం తీసుకున్నాం. తమ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని తం డాల్లో ఉన్న ఆడపిల్లల వివాహాలకు క్వింటాల్ బియ్యం, 15కిలోల మం చి నూనె, ఐదుకిలోల కందిపప్పును అం దిస్తున్నాం. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు ఎంతగానో గర్వంగా ఉంది.
– శాంతి తులసీరాం, సర్పంచ్, పటెల్‌చెరువుతండా
వివాహాలకు వెళ్తాం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం స్ఫూర్తిగా మా వంతు సాయం చేస్తున్నాం. తమ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆడపిల్లల వివాహాలకు నిత్యావసర సరుకులు అందించడంతో పాటు వారి వివాహాలకు వెళ్లడం వల్ల తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడుతున్నారు. ఇలాం టి మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది.
– శివీబాయి, అల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్
ఆదర్శంగా తీసుకోవాలి
గిరిజన తండాల్లో ఆడపిల్లల వివాహానికి నిత్యావసర సరుకులు అందిస్తున్న ఆయా గ్రామ పంచాయతీల సేవలు అభినందనీయం. సర్పంచులు ఆడపిల్లల తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇస్తున్నారు. వివాహం అయ్యేంత వరకు అక్కడే ఉండి వారికి తోడ్పాటునందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సర్పంచుల సేవలు ప్రశంసనీయం. వారిని తోటి సర్పంచులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి.
-రాందాస్‌నాయక్, జడ్పీటీసీ కులకచర్ల