ఇబ్రహీంపట్నం, జూన్ 19 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్దఎత్తున ఆయా పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని. మరోసారి అధికారం టీఆర్ఎస్దేనని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు అధికారం అందనంత దూరంలో ఉందన్నారు. పార్టీని నమ్ముకున్నవారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి సంపతీశ్వర్రెడ్డి, లింగాల రవీందర్‌గౌడ్, మర్రి రంగారెడ్డి, రాములు, అశోక్, జంగయ్య, రమేశ్, పాండు, ప్రభాకర్, కొండల్‌రెడ్డి, జంగారెడ్డి, సంరెడ్డి నారాయణ, మహేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చారితో పాటు పెద్ద ఎత్తున పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
అంబేద్కర్, జగ్జీవన్‌రాంల విగ్రహాల ఆవిష్కరణ
యాచారం : బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే అన్నారు. గున్గల్ గ్రామంలో అంబేద్కర్, జగ్జీవన్‌రాంల విగ్రహాలను ఆదివారం ఆయన ప్రారంభించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.