పరిగి, జూన్ 17: పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే కొప్పుల మహే శ్‌రెడ్డి సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసు లను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పరిగి స్వరూపం మారిందన్నారు. ప్రతిరోజూ చెత్త సేకరణ ద్వారా, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో పరి శుభ్రమైన వాతావరణం నెలకొందన్నారు. ప్రజలు సైతం తమ పరిసరాలు శుభ్రంగా ఉం చుకోవాలని చెప్పారు. గతంలో మురికికూపాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు నేడు సుం దరంగా కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ ప్రగతిలో తెలిపిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం పరిగి మండలం రాఘవాపూర్ గ్రామంలో చేపల చెరువు ప్రొసీడింగ్‌లను సంఘం సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ము కుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్ పాల్గొన్నారు.
పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్
వికారాబాద్, జూన్ 17 : వికారాబాద్ పట్టణంలోని 6, 25వ వార్డుల్లో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పరిశీలించారు. పిచ్చి మొక్కల తొలగింపు, పాడు బడ్డ ఇండ్లను కూల్చడం, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పట్టణ ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా పరిశుభ్రమైన మున్సి పాలిటీగా పేరు తేవాలని కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు సూచించారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, కౌన్సిలర్ చందర్‌నాయక్, ప్రత్యేకాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనులకు ఆటంకం కలిగించొద్దు
కులకచర్ల, జూన్ 17 : పల్లె ప్రగతి పనులకు ఎవరు కూడా ఆటంకం కలిగించొద్దని దళిత సంఘాల నాయకులు రామన్నమాదిగ అన్నారు. కులకచర్ల మండల పరిధిలోని పుట్ట పహాడ్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో పల్లె ప్రగతి పనులు నిర్వహిస్తున్న వారిపై దాడి చేయడం, పనులను అడ్డుకోవడం తగదన్నారు. అభివృద్ధికి ఆటంకం ఎవరూ కల్గించొద్దన్నారు. ఏదైనా ఉంటే సమష్ట్టిగా అందరితో కలిసి మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జాక వెంకటయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.