షాద్‌నగర్, జూన్17 : షాద్‌నగర్ మున్సిపాలిటీ 21 వ వార్డు కేశంపేట రోడ్డులో రూ. 5 లక్షల నిధులతో డ్రైనేజీ పనులను శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా అన్ని కాలనీల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పిస్తున్నామని, విడుతల వారీగా అన్ని కాలనీల్లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులను 100 శాతం పూర్తిచేస్తామని చెప్పారు. ప్రజలు పరిశుభ్రతను పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు చెట్ల నర్సింహ, జంగ రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
గాంధీ ఆశయ సాధనకు కృషిచేయాలి
గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో జగదంబా, సంత్ శ్రీ సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవాలాల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శోభ, సర్పంచ్‌లు ప్రభాకర్, అజయ్‌నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.