షాద్‌నగర్‌టౌన్, జూన్ 12: పట్టణ ప్రగతితో పట్టణాలు మరింత అభివృద్ధిని సాధిస్తున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 2, 10, 22, 27వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆదివారం పరిశీలించారు. కలుపు మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో అన్ని ప్రాంతాలు మరింత అభివృద్ధి సాధించాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కౌన్సిలర్ ప్రతాప్‌రెడ్డి, నాయకులు జూపల్లి శంకర్, జమృత్‌ఖాన్, యాదగిరి, శేఖర్, నర్సింలు, భిక్షపతి, అశోక్, రాజశేఖర్, రాధాకృష్ణ, వెంకటేశ్, సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.
నిరుపేదలకు కొండంత అండ
పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి సంజీవనిలా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన షహీన్ సుల్తానాకు రూ. 14 వేలు, కృష్ణయ్యకు రూ. 18 వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సీఎంఆర్ఎఫ్తో పేదలకు చేయూత
నందిగామ : పేదలకు సీఎం సహాయనిధి చేయూతనిస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వీర్లపల్లి గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్యకు లక్ష రూపాయలు, విఠలయ్యగౌడ్కు రూ. 36 వేలు, ఎండీ మహబూబ్‌కు రూ. 52 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, కోఆప్షన్ మెంబర్ బేగ్, టీఆర్ఎస్ నాయకులు రజనీకాంత్గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
కోట మైసమ్మ ఆలయంలో పూజలు
షాద్‌నగర్‌రూరల్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలోని కోట మైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆదివారం పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ పునఃనిర్మాణానికి సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ ప్రతాప్‌రెడ్డి, నాయకులు జూపల్లి శంకర్, జమృత్‌ఖాన్, శివ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.