షాద్‌నగర్‌టౌన్, జూన్ 11: ప్రతి పల్లె, పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 24వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శనివారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్ నందీశ్వర్తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కార్మికులతో కలిసి కలుపు మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతితో ప్రతి వార్డు పరిశుభ్రంగా మారిందన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్య ఉన్న కౌన్సిలర్, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్‌నాయక్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో అభివృద్ధిలో గ్రామాలు
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగ తి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు పూర్తి గా మారిపోతున్నాయని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. శనివారం ఉప్పరిగూడలో తడి, పొడి చెత్త ను వేరు చేశారు. రోడ్లను శుభ్రం చేశారు. వివిధ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. కార్యక్రమంలో ఎం పీపీ కృపేశ్, వైస్‌ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి పాల్గొన్నారు.
ఉత్సాహంగా పట్టణ ప్రగతి
పెద్దఅంబర్‌పేట : 1వ వార్డు పరిధి రాజీవ్ గృహకల్పలో కౌన్సిలర్ గ్యారల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రగతిలో చేపట్టే పనులు, వివిధ పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చామ సంపూర్ణ, కమిషనర్ రామాంజులరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పనులు ముమ్మరంగా చేపట్టాలి
కడ్తాల్ : గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామంలో ఎంపీడీవో పర్యటించారు. నర్సరీ, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి, తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ అనిల్‌యాదవ్, కార్యదర్శి హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
పరిశుభ్రంగా గ్రామాలు
షాబాద్ : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయని దామర్లపల్లి సర్పంచ్ బోకుల లింగం అన్నారు. శనివారం గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. అన్ని కాలనీల్లోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రజలందరి భాగసామ్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్: పట్టణ ప్రగతిలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని తుర్కయంజాల్ మున్సిపాలిటి కౌన్సిలర్ కొశికె అయిలయ్య అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడ కాలనీల రోడ్లను స్థానిక యువకులతో కలిసి కౌన్సిలర్ అయిలయ్య శుభ్రం చేశారు. అదే విధంగా మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతి మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డులలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. వివిధ కాలనీల్లో టీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్‌నాయక్ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు.
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి
కొత్తూరు రూరల్ : పల్లెప్రగతితో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎంపీడీవో శరత్చంద్రబాబు అన్నారు. ఏనుగులమడుగుతండా గ్రామాన్ని ఎంపీడీవో శరత్చంద్రబాబు, ఎంపీవో నర్సింహ పరిశీలించారు. పల్లెప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్‌యార్డ్, మరుగుదొడ్లు, స్మశానవాటికను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ పాల్గొన్నారు.
ఫలాలిస్తున్న హరితహారం మొక్కలు
చేవెళ్లటౌన్ : పల్గుట్ట, కందవాడ గ్రామంలో ఎంపీడీవో రాజ్‌కుమార్ పర్యటించారు. హరితహారంలో భాగంగా పల్గుట్ట గ్రామంలో ఇంటింటికీ పంపిణీ చేసిన మామిడి మొక్క లు ఫలాలు ఇస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి నరేష్ గౌడ్, సిబ్బంది పనితీరును ప్రశంసించారు.అనంతరం కందవాడలో కంపోస్టుయార్డు, వైకుంఠధామాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆయనతో పాటు కార్యదర్శి మన్మోహన్, రాములు, యాదయ్య, రంగ, రాఘవేందర్ తదితరులు ఉన్నారు.