కడ్తాల్, జూన్ 11 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బసవేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థాని క ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులతో కలిసి ఎమ్మె ల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. సమాజంలో అంద రూ సమానమేనని, కుల, వర్ణ, లింగ వివక్షతకు వ్యతిరేకం గా బసవేశ్వరుడు బోధనలు చేశారన్నారు. గ్రామాల్లో నిర్మిం చే ఆలయాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యేని వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం నాయకులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఉప సర్పంచ్ రామకృష్ణ, మల్లప్ప, సర్వేశ్వర్, ఈశ్వరప్ప, శరణుబసప్ప, నరేందర్‌రెడ్డి, గంప శ్రీను, వీరయ్య, వెంకటేశ్, జంగారెడ్డి, రమేశ్అయ్యగారు పాల్గొన్నారు.
చంద్రధన, అంతారం గ్రామాల్లో..
తలకొండపల్లి : చంద్రధన, అంతారం గ్రామాలో బొడ్రాయి, మైసమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాలకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో రైతుసమితి మండల అధ్యక్షుడు నర్సింహ, సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, దశరథ్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, శంకర్, శ్రీనివాసులు, పెంటయ్య, ఉపసర్పంచ్ సుధాకర్, మల్లేశ్, యాదయ్య పాల్గొన్నారు.