మర్పల్లి, జూన్ 10: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్‌లో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ్రప్రతి శుక్రవారం నీటి తొట్టెలను శుభ్రం చేయాలని తెలిపారు. బహిరంగ మలవిసర్జన చేయరాదని మరుగు దొడ్లను వినియోగించుకోవాలని సూచించారు. పాడుబడిన ఇండ్లను తొలగించాలన్నారు. గ్రామంలో పాడుబడిన విద్యుత్ స్తంభాలను తొలగించి, వేలాడుతున్న తీగలను సరి చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పశువులకు తాగునీటి కోసం నీటి తొట్టె లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. ఏడాదికి మూడు సార్లు జీవాలకు నట్టల నివారణ మందు వేస్తున్నామని, జీవాలు ఉన్న రైతులు తప్పని సరిగా వేయించాలన్నారు.
నట్టల నివారణ మందుతో మూగజీవా లకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, ఎంపీటీసీ రవీం దర్, ఎంపీడీవో జగన్నాథ్‌రెడ్డి, ఎంపీవో లక్ష్మీకాంత్, ఆర్ఐ మాదవరెడ్డి, జిల్లా పశు వైద్యాధికారి అనిల్‌కుమార్, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, రైతు బంధు సమతి మండలాధ్యక్షుడు నాయబ్‌గౌడ్, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, మండల ప్రధానకార్య దర్శు మధుకర్, రాచయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ యాదయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు