షాద్‌నగర్‌టౌన్, జూన్ 9 : ప్రతి మున్సిపాలిటీని ఆదర్శం గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పట్టణ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం పట్టణ ప్రగతి పనులను కౌన్సిలర్ ప్రతాప్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రతి వార్డు ఎంతో శుభ్రంగా మారిందన్నారు. పట్టణ ప్రగతి ద్వారా శుభ్రం చేసిన వీధుల్లో, ఖాళీ స్థలాల్లో ఎలాంటి చెత్తాచెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణ ప్రగతితో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని 6వ వార్డులో కౌన్సిలర్ లతాశ్రీ, మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి పనులను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ సాయి, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతినగర్‌లో పట్టణ ప్రగతి
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీ 4వ వార్డులోని శాంతినగర్ కాలనీలో కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. నాలాను శుభ్రపరిచారు. అంగన్వాడీ భవనం, ప్లేస్కూల్ పరిసరాల్లోని చెత్తా చెదారాలను తొలగించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రంజిత్, స్థానికులు భగత్, అమ్రేశ్, శ్రవణ్ పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
షాబాద్ : పరిసరాలేను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మల్లారెడ్డిగూడ సర్పంచ్ చందిప్ప జంగయ్య అన్నారు. గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పరిగి గణేశ్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్, రాజు, సత్యనారాయణ, నర్సింహులు తదితరులున్నారు.
శిథిలావస్థలోని ఇండ్ల కూల్చివేత
శంకర్పల్లి : పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శం అని రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం అద్యక్షుడు,శంకర్పల్లి మండలం మిర్జాగూడలో సర్పంచ్ రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతిలో భాగంగా పడావుబడ్డ ఇండ్లను కూల్చి వేశారు. అనంతరం ఇంద్రారెడ్డి నగర్లో కాలనీ వాసుల అభ్యర్థన మేరకు పోచమ్మ ఆలయం వద్ద వైస్ ఎంపీపీ రాములమ్మ, సర్పంచ్ రవీందర్‌గౌడ్ తమ సొంత నిధులు రూ. 15 లక్షలతో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వేయించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కురుమ వెంకటేశ్, వార్డు సభ్యులు ప్రవీణ్, కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శవంతంగా గ్రామాలు
షాద్‌నగర్‌రూరల్ : ఫర్ఖ్నగర్ మండంలంలోని వివిధ గ్రామాల్లో పారిశుధ్య పనులను చేపట్టారు. వీధులను శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామా ల సర్పంచ్‌లు ప్రజలకు సూచించారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు ఆదర్శవంతంగా తయారవుతున్నాయన్నారు.
ముర్తుజాగూడలో..
మొయినాబాద్ : మండలంలోని ముర్తుజాగూడ గ్రామం లో సర్పంచ్ సప్పిడి మాణెమ్మ ఆధ్వర్యంలో రోడ్లను ఊడ్చా రు. ఇంటి చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలన్నా రు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య, మాజీ సర్పంచ్ కృష్ణయాదవ్, వార్డు సభ్యులు కృష్ణారెడ్డి, గోపాల్, కో ఆప్షన్ సభ్యుడు రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనుల పరిశీలన
కేశంపేట : వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. తొమ్మిదిరేకుల, వేములనర్వ, లేమామిడి గ్రామాల్లో పారిశుధ్యం, పల్లె ప్రకృతివనాలు, వననర్సరీలు, క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రి, మంజుల, శ్రీశైలంగౌడ్, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాలు శుభ్రం
కొందుర్గు : పల్లె ప్రగతితో గ్రామాలు శుభ్రంగా మారుతున్నాయని జిల్లెడు సర్పంచ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు అన్నారు. గ్రామ వీధులను శుభ్రం చేశా రు. చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో కార్యదర్శి సమత, ఉప సర్పంచ్ లక్ష్మి, వీఆర్ఏ యాదయ్య, గ్రామస్తులు మల్లేశ్, చిన్నయ్య, భాగ్యమ్మ, కిష్టమ్మ పాల్గొన్నారు.
పనుల పరిశీలన
కడ్తాల్ : మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనంలోని మొక్కలను పరిశీలించారు. గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 18 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసిన్నట్లు సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆమనగల్లు మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో ఎంపీడీవో వెంకట్రాములు పారిశుధ్య పనులను పరిశీలించారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి
యాచారం : ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించారు. అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. పకడ్బందీగా చేయయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు నర్సిరెడ్డి, భాషయ్య, సబిత, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో..
కొత్తూరు రూరల్ : గూడూరు, మక్తగూడ, మల్లాపూర్, తీగాపూర్ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు బ్యాగరి సత్తయ్య, కాట్న రాజు, సాయి లు, రమాదేవి ఆధ్వర్యంలో వీధుల గుండా, ఆయా కాలనీలో, శ్మశానవాటికల వద్ద చెత్తాచెదారాన్ని, కలుపు మొక్కలను తొలగించారు.