షాబాద్, జూన్ 9: జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ టీకాలు వేయించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని బొబ్బిలిగామ, కొమరబండ, చందనవెళ్లి గ్రామాల్లో సిబ్బందితో కలిసి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాలు వేశారు. జీవాలకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది శ్రీను, విజయ్, గొర్రెల కాపరులు తదితరులు పాల్గొన్నారు.
నట్టల మందు వేయించాలి
శంకర్పల్లి : మేకలు, గొర్రెలకు తప్పని సరిగా నట్టల మందు వేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మీప్రవీణ్‌కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నశంకర్‌పల్లి 6వ వార్డులో మేకలకు నట్టల మందు వేశారు.7వ వార్డు లో వరద నీరు పోవడానికి ఓపెన్ డ్రైన్ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ అశోక్, కో ఆప్షన్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ గ్రామంలో నందిగామ మండల వైద్యాధికారి సునీత ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమాన్ని ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షురాలు కట్న లత ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నర్సింహులు, రాములమ్మ పాల్గొన్నారు.
గౌరెల్లిలో..
పెద్దఅంబర్‌పేట : నట్టల నివారణ మందు వల్ల మూగజీవాలు ఆరోగ్యంగా మారుతాయని గౌరెల్లి సర్పంచ్ తుడుము మల్లేశ్ అన్నారు. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ చైర్మన్ శంకర్‌యాదవ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పాండు, పశు వైద్యులు పాల్గొన్నారు.
చింతకుంటపల్లిలో..
కేశంపేట : చింతకుంటపల్లిలో పశువైద్యాధికారులు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోచమోని పార్వతమ్మ, డాక్టర్ నివేదిత తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్ : మండల పశువైద్యాధికారి డాక్టర్ స్ఫూర్తి ఆధ్వర్యంలో తీగాపూర్, ఫాతిమాపూర్ గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. 1309 గొర్రెలకు, 216 మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది మల్లయ్య, కృష్ణ, పద్మ, రవి, రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కడ్తాల్: గొర్ల కాపరుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ అన్నారు. న్యామతాపూర్ గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. జీవాలను సంరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమం లో సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, మండల పశువైద్యాధికారి భానూనాయక్, జేవీవో రాజేశ్, రైతులు సత్తయ్య, రమేశ్, స్వామి పాల్గొన్నారు.