ఇబ్రహీంపట్నం, జూన్ 8 : నియోజకవర్గంలోని మత్స్యకారులు అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో వలల ద్వారా చేపలు పట్టారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట, ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటల వద్దకు చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఇబ్రహీంపట్నం చౌరస్తాతో పాటు మాల్ మార్కెట్లో చేపల విక్రయాలు జోరుగా జరిగాయి. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ నుంచి మాల్ వరకు సాగర్హ్రదారి వెంట మత్స్యకారులు పెద్ద ఎత్తున చేపల విక్రయాలు జరిపారు.
చెరువుల వద్దే చేపల విక్రమాలు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని చెరువుల వద్దే చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఉదయం నుంచే ప్రజలు చెరువుల వద్దకు వెళ్లి చేపలను కొనుగోలు చేశారు. మత్స్యకారులు మంగళవారం రాత్రి నుంచే చేపల వేట మొదలు పెట్టారు.