కొత్తూరు రూరల్, జూన్ 8 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ, పెంజర్ల, శేరిగూడబద్రాయపల్లి, సిద్దాపూర్ గ్రామాల్లో బుధవారం జిల్లా విద్యా కమిటీ మెంబర్, కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, మండల విద్యాధికారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 4.16 కోట్ల నిధులతో పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సదుపాయం, పాఠశాల భవనానికి మరమ్మతులు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ వంటి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఇన్ముల్‌నర్వ గ్రామంలో ఉపసర్పంచ్ శ్రీరాములుయాదవ్, పెంజర్ల గ్రామంలో వసుంధర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇన్ముల్‌నర్వ గ్రామంలో ఉప సర్పంచ్ శ్రీరాములుయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. డాక్టర్ స్ఫూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జీవాలకు మందులను వేశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శ్మశాన వాటికల్లో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే కలుపు మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శోభ, ఎంపీడీవో శరత్చంద్రబాబు, ఎంఈవో కృష్ణారెడ్డి, పీఆర్ ఏఈ హేమంత్, సర్పంచ్‌లు వసుంధర, తులసమ్మ, ప్రభాకర్, సత్తయ్య, సాయిలు, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, ఉపాధ్యక్షుడు డి.జంగయ్యయాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్లు పద్మారావు, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, ఎస్ఎంసీ చైర్మన్ నయిమాబాను పాల్గొన్నారు.
చౌలపల్లిలో బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవం
కేశంపేట : మండలంలోని చౌలపల్లితో పాటు గ్రామ పరిధిలోని మీనమోనిపల్లిలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై పూజలు చేశారు. ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడ వీరేశ్, ఎంపీపీ రవీందర్, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.