మొయినాబాద్, జూన్ 8 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం భోజనశాల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నదన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ మోడల్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ వలంటీర్లు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. అభివృద్ధిలో భాగస్వాములవ్వాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, వైస్ ఎంపీపీ మమత, ఉప సర్పంచ్ షాబాద్ శ్యాంరావు, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీవో సంధ్య, ఎంఈవో వెంకటయ్య, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, హెచ్ఎం మెహర్ ఉన్నీసాబేగం, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, కవిత, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.