ధారూరు, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపడుతున్న ధాన్యం కొనుగోలు మండలంలో ఊపం దుకున్నది. రైతులు కష్టపడి పండించుకున్న పంటలకు భరోసాను కల్పించేందుకు ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నది. ధారూ రు మండల పరిధిలోని మూడు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, నాగారం గ్రా మంలో పీఏసీఎస్ ధారూరు ఆధ్వర్యంలో, గట్టేపల్లి గ్రామంలో పీఏసీఎస్ హరిదాస్పల్లి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా ఏర్పా టు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడు ధాన్యానికి రూ.1960, కామన్ గ్రేడు ధాన్యానికి రూ.1940 ప్రకారం చెల్లిస్తున్నారు. ధాన్యం నాణ్యతను, తేమ శాతాన్ని బట్టి మద్దతు ధర ప్రకటిస్తామని అధికారులు తెలియ జేస్తున్నారు.
దళారుల బాధ తప్పింది…
పండించిన పంటను ఎక్కడ అమ్ము కోవాలో తెలియక దళా రుల వద్ద వారు ఇచ్చిన ధరలకు అమ్మి తీవ్రం గా మోసపోయే వాళ్లం . ప్రస్తుతం సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించి, గ్రా మాల్లో నే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతు లను ఆదు కుంటున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు.
– సోప్పరి వెంకటయ్య, రైతు బంధుసమితి మండల అధ్యక్షుడు, ధారూరు.