తుర్కయంజాల్, జూన్ 5 : ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని మున్సి పాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ అన్నారు. మున్సిపాలిటీ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతితో కలిసి ఆదివారం వార్డుల్లో పర్యటించారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యతన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
నందిగామ, జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని బండకుంటతండాలో ఛత్రపతి యూత్ సభ్యులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో దాసరి శ్రీశైలం, గోపి, రవి, రాహుల్, రాఘవేంద్ర, దేవేందర్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
శంకర్పల్లి, జూన్ 5 : మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యప్ప దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.