మర్పల్లి, జూన్ 4 : ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జన్మదిన వేడుకలను శనివారం మర్పల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ లలితారమేశ్, జడ్పీటీసీ మధుకర్, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్‌చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. వికారాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు సోహెల్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నాయబ్‌గౌడ్, రమేశ్, మండల నాయకులు మధుకర్, అశోక్, రాచయ్య, అంజయ్యగౌడ్, డైరెక్టర్ యాదయ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు గఫార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బంట్వారంలో..
బంట్వారం, జూన్ 4 : ఎమ్మెల్యే ఆనంద్ జన్మదిన వేడుకలను మండలంలోని బస్వపూర్ గ్రామంలో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ నర్సింహులు, ఎస్ఎంసీ చైర్మన్ శివరాజ్ పంచాయతీ ఆవరణలో కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ బల్వంత్‌రెడ్డి, కార్యకర్తలు నరేశ్, రాజు పాల్గొన్నారు.
కోట్‌పల్లి మండల కేంద్రంలో..
కోట్‌పల్లి, జూన్ 4 : ఎమ్మెల్యే ఆనంద్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే ఆనంద్‌కు శుభాకాంక్షల వెల్లువ
వికారాబాద్, జూన్ 4 : ఎమ్మెల్యే ఆనంద్ జన్మదిన వేడుకల సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించారు. వీరిలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదిని, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, నవీన్‌కుమార్, కృష్ణ, గాయత్రీలక్ష్మణ్, పుష్పలతారెడ్డి, స్వాతిరాజ్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, మోమిన్‌పేట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్, జిల్లా టీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, మర్పల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ మధుకర్, నాయకులు మధుకర్ పాల్గొన్నారు.
ధారూరులో
ధారూరు, జూన్ 4: ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జన్మదిన వేడుకలు శనివారం ధారూరు మండలం టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు నరోత్తంరెడ్డి, రాములు, వీరేశం, అంజయ్య, ఖుదరత్అల్లి, లక్ష్మయ్య, జైపాల్‌రెడ్డి, దేవేందర్, శ్రీనివాస్, అమర్నాథ్, రాజుగుప్తా, చంద్రమౌళి పాల్గొన్నారు.