షాబాద్, జూన్ 3: పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని సర్దార్‌నగర్ గ్రా మంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, జనార్దన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డితో కలిసి ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి పల్లెప్రగతి కార్యక్రమ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, తెలంగాణ గ్రా మీణ క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ గతం లో ఏ గ్రామానికెళ్లినా చెత్తతో స్వాగతం పలికేవని…కానీ ప్రస్తుతం పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు దర్శనమిస్తున్నాయని తెలిపారు.
‘పల్లెప్రగతి’తో జిల్లాలోని అన్ని గ్రామాల్లో కంపోస్ట్యార్డులు, వైకుంఠధామాలు, హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా అన్ని గ్రామాల్లోనూ తెలంగాణ క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. దేశమంతా ఏడాదికి ఒకసారి గ్రామా లు ఏ విధంగా ఉన్నాయో సర్వే నిర్వహిస్తారని, ఈ సర్వేకు దేశవ్యాప్తంగా పది గ్రామాలు ఎంపిక కాగా…అవి తెలంగాణకు చెందిన గ్రామాలే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,700 గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న షాబాద్ మండలం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్నదని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇక్కడికి పెద్ద, పెద్ద కంపెనీలు వస్తున్నాయని కొనియాడారు. రాజకీయంగా నిందలు వేసేందుకే బీజేపీ నాయకులు గ్రామాల్లో సర్పంచులకు నిధులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో పల్లెప్రగతి ద్వారా రూ.335 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా.. అందులో చెల్లించాల్సినవి రూ. 16 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. సర్సంచ్ లు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దన్నారు.
అనంతరం జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెప్రగతిలో సర్దార్‌నగర్ గ్రామం ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. మిగతా అన్ని గ్రామాల్లోనూ అధికారులు పర్యటించి పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌం డ్ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి మంత్రి సబితారెడ్డి ఘనస్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్‌రావు, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీఆర్డీవో ప్రభాకర్, ఆర్డీవో వేణుమాధవ్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, గ్రామ సర్పంచ్ మునగపాటి స్వరూప, ఎంపీటీసీ వనిత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పోన్న స్వప్నానర్సింహారెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, సహకార సంఘం చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, తహసీల్దార్ సైదులు, ఎం ఈవో శంకర్‌రాథోడ్, డీఎల్పీవో శ్రీకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, పీఆర్ డీఈ విజయ్‌కుమార్, ఏఈ శ్రీదివ్య, పాఠశాల హెచ్ఎం సునీత, సుశీల, జంగయ్య, సుదర్శన్, ఉప సర్పంచ్ ఇందిర, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, సతీశ్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, కారు చెన్నయ్య, గుండాల సర్పంచ్ ప్రణతి, ఉప సర్పంచ్ బాల్‌రాజ్, వెంకట్‌రెడ్డి, యాదిరెడ్డి, గణేశ్, యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, ఎంపీడీవో రాజ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సం క్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పేదలు, రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం 15 రోజులపాటు జరుగుతుందని, అధికా రు లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో జయప్రదం చేయాలని సూచించారు. మార్కెట్ కమిటీలో రూ.6 కోట్ల నిధులు ఉన్నాయని, అయితే కోర్టులో కేసు ఉండటంతో ఆ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని, త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన మంత్రిని కోరారు.
గ్రామాలు శుభ్రంగా మారాయి
రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ గతంలో గ్రామాలకెళ్తే కరెంట్, తాగునీరు సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని.. కానీ సీఎం కేసీఆర్ చేపట్టిన ‘పల్లెప్రగతి’తో అన్ని గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయని ప్రశంసించా రు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేయడం ద్వారా నర్సరీల్లో మొక్కలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రభు త్వం బాధ్యతలతోపాటు నిధులను కూడా క్రమం తప్పకుండా ప్రతినెలా మంజూరు చేస్తున్నదని ఆమె తెలిపారు.