తిమ్మాపూర్ : పొట్ట తిప్పల కోసం కొన్నేళ్ల పాటు దుబాయి ( Dubai ) వెళ్లి 20 రోజుల కిందటే ఇంటికి వచ్చిన యువకుడు అనుమానాస్పద స్థితిలో ( Suspicious Death ) మృతి చెందడం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి శివారులో కలకలం రేపింది. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బనక చందు (30) అనే యువకుడు ఇటీవల దుబాయి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు
. ఈ క్రమంలో బుధవారం ఉదయం చందుకు ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మధ్యాహ్నం మల్లాపూర్, మన్నెంపల్లి శివారు డీ4 కెనాల్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది స్థానికులకు కనిపించాడు. చందు శరీరంపై గాయాలు ఉండడంతో తన కుమారుడిని చంపి కెనాల్ లో పడి వేసారంటూ మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
సంఘటన స్థలానికి తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ చేరుకొని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.