యాచారం, జూన్ 3 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పడుతున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గున్గల్ గ్రామంలో 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలను మనమే అభివృద్ధి చేసుకోవాలన్నారు. గున్గల్ గ్రామాభివృద్ధికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, ప్రత్యేకాధికారి జంగారెడ్డి, సర్పంచ్ ఇందిర, ఉపసర్పంచ్ భీం యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కర్నాటి రమేష్‌గౌడ్, పాచ్చ భాష పాల్గొన్నారు.
మారిన గ్రామాలు, తండాల రూపురేఖలు
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పల్లె ప్రగతి కార్యాచరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, వైస్ ఎంపీపీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అంతకుముందు పల్లెప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, నాయకులచే ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. గాన్గుమార్లతండాలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, ఎంపీవో మధుసూదనాచారి, సర్పంచ్‌లు తులసీరాంనాయక్, హంశ్యమోత్యానాయక్, హరిచంద్‌నాయక్, కృష్ణయ్యయాదవ్, యాదయ్య, భారతమ్మ, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ప్రియ, ఉమావతి, విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు పరమేశ్, వాగ్ధేవి, ఉప సర్పంచ్‌లు, ఏంఎసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు,వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆమనగల్లు మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో ఎంపీడీవో వెంకట్రాములు పాల్గొన్నారు. తలకొండపల్లి, మాడ్గుల్ మండలాల్లో పల్లె ప్రగతి నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లమ్మ, ప్రత్యేకాధికారి నీరజ, ఏపీడీ సక్రియనాయక్, ఏంపీవో శ్రీలత పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శం
పల్లె ప్రగతి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. వార్డుల్లో కొనసాగిన పట్టణ ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రతాప్‌రెడ్డి, సర్వర్‌పాషా, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వర్, గౌస్, అంతయ్య, నందీశ్వర్, మహేశ్వరి, కో-ఆప్షన్ సభ్యుడు కిషోర్, నాయకులు జూపల్లి శంకర్, యాదగిరి, నందకిషోర్, రవి, పాండురంగారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, అశోక్, శ్రీకాంత్, రాజశేఖర్, రాజు, వెంకటేష్ పాల్గొన్నారు.
మోడల్ మార్కెట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. రూ. 4.50కోట్లతో సమీకృత మోడల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, అంతయ్య, సర్వర్‌పాషా, శ్రీనివాస్, రాజేశ్వర్, నందీశ్వర్, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మినర్సింహారెడ్డి, నాయకులు జూపల్లి శంకర్, నడికూడ యాదగిరి, పాండురంగారెడ్డి, రవి, నందకిషోర్, రాఘవేందర్‌రెడ్డి, దామోదర్‌యాదవ్, రాజశేఖర్, రాజు పాల్గొన్నారు.
పట్టణ, పల్లె ప్రగతితో మరింత అభివృద్ధి
షాద్‌నగర్, జూన్3: పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో అన్ని ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో పట్టణ ప్రగతి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్ పాల్గొన్నారు.
కొత్తూరులో..
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2 ,8, 12 వార్డులో పట్టణ ప్రగతి పనులను ప్రారంభించారు. వార్డులో పర్యటిస్తూ పరిసరాల శుభ్రతను పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్‌యాదవ్, వైస్ చైర్మన్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, వార్డుల కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
ప్రారంభమైన 5వ విడుత పల్లె ప్రగతి
పల్లె ప్రగతి 5వ విడుతలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులు పల్లె ప్రగతి పనులను ప్రారంభించారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు పల్లె ప్రగతిపై గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. కొత్తూరు మండలం, నందిగామ, కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట మండలాల్లోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులు పల్లె ప్రగతి పనులపై ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ఎండీవో మమతాబాయి అన్నారు. మండలంలోని కవాడిపల్లి గ్రామంలో సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో వైస్‌ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డితో కలిసి ర్యాలీ నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి ఐదో విడుతను ప్రారంభించి గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రేఖామహేందర్‌గౌడ్, జడ్పీటీసీ దాస్‌గౌడ్, సర్పంచ్‌లు పారిజాత, లావణ్య, రంగయ్య, వెంకటేష్, సుధాకర్‌రెడ్డి, లావణ్య, లతశ్రీ, రాధ, యశోద, కిరణ్‌కుమార్, వీరస్వామిగౌడ్, సంతోష, శ్రీనివాస్‌రెడ్డి, వనజ, ఎంపీటీసీలు సాయికుమార్‌గౌడ్, లావణ్య, బాలమణి, వెంకటేశ్, అనిత, బాలలింగస్వామి, ఉపసర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు రమేశ్, బబిత, అరుణ ఉన్నారు.
పల్లెలన్నీ శుభ్రంగా మార్చాలి
పల్లెలన్నీ శుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ఐదో విడుత శుక్రవారం ప్రారంభమైంది. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు మొదటి రోజు గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. 15రోజుల పాటు పల్లెప్రగతిలో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై గ్రామ సభల్లో చర్చించారు. శనివారం నుంచి అన్ని గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా వివిధ రకాల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో పరిశుభ్రత
పెద్దఅంబర్‌పేట, జూన్ 1: పట్టణ ప్రగతి కార్యక్రమంతో వార్డులన్నీ పరిశుభ్రతగా మారుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి పేర్కొన్నారు. శుక్రవారం పసుమాములలోని పుర కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పి. రామాంజులరెడ్డితో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఇంటింటికీ వెళ్లి మొక్కలు అందజేసి.. వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మణెమ్మ, టీఆర్ఎస్ నాయకులు చిరంజీవి, మున్సిపల్ అధికారులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. మరోవైపు, మున్సిపాలిటీలోని ఇతర వార్డుల్లో కౌన్సిలర్లు పాశం అర్చనా దామోదర్, గీతా వేణుగోపాల్‌రెడ్డి, మండల కోటేశ్వర్రావు, బొర్రా అనురాధ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. వార్డుల్లో చేపట్టబోయే పలు కార్యక్రమాలపై చర్చించారు.
పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం
పట్టణ ప్రగతితో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధా రాంరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధి తొర్రూర్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్డు సభలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శివలింగంగౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతితో కలిసి ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ హరితాధన్‌రాజ్‌గౌడ్, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
మంచాలలో..
పల్లెప్రగతితో సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని మండల ప్రత్యేకాధికారి, డిఫ్యూటీ సీఈవో రంగారావు అన్నారు. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రలు నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభలు నిర్వహించారు. అధికారులు ప్రజాప్రతినిధులు, యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అనిత, వివిద గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో అధికారుల పర్యటన
అబ్దుల్లాపూర్‌మెట్‌లో మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ రేఖామహేందగౌడ్, సర్పంచ్ చెరుకు కిరణ్‌కుమార్‌తో కలిసి గ్రామంలోని ప్రధాన వీధుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీవో వినోద, ఉపసర్పంచ్ చెరుకు కావ్య, పంచాయతీ కార్యదర్శి జమీల్, వార్డుసభ్యులు ఉన్నారు.