ఇబ్రహీంపట్నం, జూన్3: దళితబంధు పథకం ఎంతో చారిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో దళితబంధు ద్వారా మంజూరైన వాహనాలను శుక్రవారం పంపిణీ చేశారు. 25మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీ ఆటోలు తదితర యూనిట్లను ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రూ.10లక్షలతో తమకు ఇష్టమైన వ్యాపారం చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. అణగారిన వర్గాలను దళితబంధు పథకం ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపాలిటీ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, టీఆర్ఎస్ నాయకులు రమేశ్‌గౌడ్, భాష, గోపాల్, జంగయ్య, రాజేందర్‌రెడ్డి, యాదయ్య, మల్లేశ్, రమేశ్, బహదూర్ పాల్గొన్నారు.
పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరం
పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ సుచరిత ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మంజూరైన 42మంది లబ్ధిదారులకు రూ. 42,04,872ల చెక్కులను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పింఛన్లను త్వరలో అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2.5కోట్లతో 30పడకల దవాఖానగా ఏర్పాటు కానుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ సందర్శించారన్నారు. మీర్ఖాన్పేట నుంచి యాచారం వరకు, నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ఆయన వెంట ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, ప్రత్యేకాధికారి జంగారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ వినోద్, సర్పంచ్‌లు ఉదయశ్రీ, హబీబుద్దీన్, సరిత, జగదీశ్, పీఏసీఎస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్ స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, నాయకులు శేఖర్‌రెడ్డి, యాదయ్య, మల్లేశ్, యాదయ్యగౌడ్, రమేశ్ ఉన్నారు.