షాబాద్, నవంబర్ 22: రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కలిశారు. సోమవారం కలెక్టరేట్లో ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మహేందర్‌రెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, కాలె జయమ్మ, మాలతి, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, గునుగుర్తి నక్షత్రం, భవాని, విజయలక్ష్మి, గోవర్ధన్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు జడల లక్ష్మి, కర్నె శివప్రసాద్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్, గోపా ల్, నాగిరెడ్డి, వాసుదేవ్‌కన్నా, లక్ష్మీకాంత్‌రెడ్డి, జడల రాజేందర్‌గౌడ్, రమేశ్‌యాదవ్, సతీశ్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, జయంత్‌రెడ్డి, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
తరలివచ్చిన నాయకులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు సోమవారం రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్, మహేశ్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకులు అధిక సంఖ్యలో నామినేషన్ కార్యక్రమాని కి తరలివచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ చే వెళ్ల మండలాధ్యక్షుడు ప్రభాకర్, వెంకట రంగారెడ్డి, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.