రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యం లో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో అధిక సంఖ్యలో చేరుతున్నారు. ఇప్పటికే కందుకూరు మండలంలో బీజేపీకి చెందిన పలు గ్రామాల సర్పంచులు టీఆర్ఎస్లో చేరగా, తాజాగా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ సర్పంచ్ మహేశ్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి సోమవారం శ్రీనగర్‌కాలనీలోని మంత్రి సబితారెడ్డి నివాసం వద్ద ఆమె సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగి పలు గ్రామాల్లో సమూల మార్పు వచ్చిందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం మహేశ్ మాట్లాడుతూ నియోజకవర్గాభివృద్ధి మంత్రి సబితాఇంద్రారెడ్డితోనే సాధ్యమని నమ్మి టీఆర్ఎస్లో చేరుతున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కందుకూరు మండలాధ్యక్షుడు జయేందర్, నాయకులు లక్ష్మి, నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, గోవర్ధన్, విష్ణువర్ధ్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం దళితబంధు పథకం
బడంగ్‌పేట/మహేశ్వరం, మే 30: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె మహేశ్వరంలో దళితబంధు పథకానికి ఎం పికైన 39 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఆటో లు, కార్లను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ పథ కం దేశానికే ఆదర్శమని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దళితులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంద న్నారు.
మొదటి విడుతలో నియోజకవర్గానికి చెందిన వంద మందిని ఎంపిక చేసి ట్రాక్టర్లు, ఆటోలు, కార్లను పంపిణీ చేస్తున్నట్లు.. త్వరలోనే రెండోవిడుతలో రెండు వేల మందికి దళితబం ధు కింద రూ.పది లక్షలు అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24 గంటలపాటు ని రంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అన్నదాతలను ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ఏడాదికి రెండు విడుతలుగా ఎకరానికి రూ.పది వేల చొప్పున డబ్బులను రైతుల బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మంత్రి సబితారెడ్డి పలువురు నాయకులతో కలిసి ట్రాక్టర్‌ను నడిపారు.