తాండూరు, మే 30: ఒక వైపు వంటనూనెలు, కూరగాయలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మరో వైపు కోడి మాంసం ధరలు కూడా ఆకాశాన్నంటాయి. వారాంతంలో ఒక రోజైనా మాంసా హారం తిందామనుకున్న ప్రజలకు కొండెక్కిన చికెన్ ధరలతో అయోమయం పాలవు తున్నారు. ఎండాకాలం వేడిమితో చికెన్‌ను చాల తక్కువగా తింటారు. దీంతో చికెన్ ధరలు తగ్గాల్సి ఉంటుంది. కానీ గత నెలతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు అమాంతం పెరి గాయి. స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు రూ.300 ఉండగా విత్ స్కిన్‌తో రూ.280 ధర ఉంది. కోళ్ల ధర కిలోకు రూ.200 పలుకుతోంది. బోన్‌లెస్ చికెన్ ధర రూ.600 పలుకుతోంది. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లోనే ప్రతి రోజు కనీసం 12నుంచి 15 టన్నుల కోడి మాంసం విక్రయాలు జరుగుతున్నాయి.
అదే ఆది వారం రోజు 20 నుంచి 25 టన్నుల కోడి మాంసం విక్రయం జరుగుతోంది. తాం డూరు పట్టణంలో ప్రతి రోజు 5 టన్నుల కోడి మాంసం విక్రయమవుతుండగా ఆదివారం 8 నుంచి 10 టన్నుల విక్రయం అవుతుంది. వికారాబాద్‌లో ప్రతి రోజు 3 టన్నుల నుంచి 4 టన్నుల కోడి మాంసం విక్రయమవుతుండగా ఆదివారం 8 టన్నుల వరకు కోడి మాం సం విక్రయం అవుతోంది. పరిగి, కొడంగల్ ప్రాంతాలు కలిపి ప్రతి రోజు 3 టన్నుల వర కు కోడి మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. అదే ఆదివారం రెట్టింపు మాంసం విక్ర యం అవుతోంది. అయితే ఇటీవల కాలంలో దాణా ధరలు పెరగడం వల్ల కోడి మాంసం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.
రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి కోడి మాంసాన్ని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వ్యాపారులు తీసుకు వచ్చి విక్రయిస్తుంటారు. ఈ ప్రాంతాల్లో ధరలు పెరిగిన సమయంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడి వ్యాపారులు చికెన్ కొనుగోలు చేస్తుంటారు. ఒక కోడిని మాంసం విక్రయ దుకాణాలకు తీసుకు వచ్చే వరకు రవాణా చార్జీలే రూ.6 నుంచి 8 వరకు సగటున ఖర్చవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో 3 నుంచి 4 వరకు అయ్యే రవాణా చార్జీలు కూడా ప్రస్తుతం పెరిగాయని అన్నారు.
అలాగే దాణా ధరలు కూడా ఆకాశాన్నం టినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది టన్ను చెక్కు ధర రూ.32500 నుంచి రూ.40 వేలు ఉండగా ఇప్పుడు రూ.90 వేలకు పెరగడంతో కోళ్ల పరిశ్రమలపై ఆర్థికభారం పడింది. పెరిగిన కోళ్ల దాణా ధరలతో మాంసం విక్రయం దారులు ఎక్కువ మొత్తంలో కోళ్లను నిల్వ ఉంచుకునేందుకు అవకాశం ఉండదు. స్నేహ, సుగుణ, ఎన్కాబ్ వంటి ప్ర ముఖ చికెన్ ఉత్పత్తి కంపెనీలు మాత్రం సొంతంగా దాణా తయారీ కేంద్రాలను సమ కూర్చుకున్నాయి. చిన్న చిన్న కోళ్ల ఫారాల యజమానులు మాత్రం దాణా కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది.
వేసవిలో తగ్గుతున్న ప్రొడక్షన్…
డిసెంబర్, జనవరి నెలల్లో ప్రారంభిస్తే ఒక చిక్ (కోడిపిల్ల) కిలోన్నర ఎదగడానికి 38 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ ఈ యేడు మార్చి నుంచే ఎండలు భగ్గుమం టుండడంతో చిక్స్ పిల్ల దశ నుంచి కోడి దశ ఎదగడానికి 45 నుంచి 60 రోజులు పట్ట డంతో బ్రాయిలర్ కోళ్ల ప్రొడక్షన్ తగ్గుతోందని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. కూలర్లు, ఏసీలు పెడితే కానీ కోడి పిల్లలు బతికే పరిస్థితి లేదు. నీటి వనరులు లేక ఇబ్బం దితో కొందరు పౌల్ట్రీ రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని భారీగా తగ్గించారు. ఫిబ్రవరి నుం చి క్రమంగా తగ్గడంతో ఇప్పటి వరకు ప్రొడక్షన్ పడిపోయి ధరలపై ప్రభావం పడుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
వ్యాపారం సరిగ్గా సాగడం లేదు
నెల రోజుల నుంచి కోడి మాంసం ధరలు అకస్మాత్తుగా పెరగడంతో కొనుగోలు దారుల సంఖ్య కొంత వరకు తగ్గింది. మా దుకాణంలో ప్రతి రోజు ఒక టన్నుకు పైగా కోడి మాంసం విక్రయాలు జరిగేవి. అయితే ధరలు పెరగడంతో 40 నుంచి 50 శాతం విక్రయాలు తగ్గిపో యాయి. దీంతో నిర్వహణ భారం పెరిగిపోయింది. పని చేసే వారికి వేతనాలు, ఇతరత్ర పనులకు సంబంధించి చేసే వ్యయం, పెట్టుబడులు కూడా మిగలడం లేదు. -శ్యాననద్, తాండూరు