రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయ న కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జిల్లాలో అర్హులైన 23 మంది బాధిత పిల్లలకు ఆ పథకం కింద మం జూరైన చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. కొవి డ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉపకార వేతనాలు, పీఎం కేర్స్ పాసు పుస్తకాలు, ఆయుష్మాన్ వైద్య బీమా కార్డుల ద్వారా లబ్ధి చేకూ రుతుందన్నారు. బాధిత పిల్లలు 18 ఏండ్లు నిండే వరకు వారి పేరుతో రూ.10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. వారు 23 ఏండ్లు నిండిన తర్వాత రూ.10 లక్షల ప్రీమియం అందుతుందన్నారు. బాధిత చిన్నారుల చదువు, ఆరోగ్యం, వారి పరిస్థితులను ప్రతినెలా పరిశీలించాలని జిల్లా సంక్షేమాధికారిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, జిల్లా సంక్షేమాధికారి మోతీ, నరేందర్ రెడ్డి, ఎన్ఐసీ అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, మే 30: కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని తీసుకొచ్చిందని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నా రు. సోమవారం ఆమె కలెక్టరేట్లో జిల్లాలో అర్హులై న 15మంది బాధిత పిల్లలకు ఆ పథకం కింద మం జూరైన హెల్త్‌కార్డులు, స్కాలర్షిప్పులు, పాస్‌పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడు తూ ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అందులో భాగంగానే జిల్లాలోని బాధిత పిల్లలకు హెల్త్‌కార్డులు, పాసుపుస్తకాలను అందించినట్లు తెలిపారు. బాధిత చిన్నారులు 18ఏండ్లు నిండే వర కు వారి పేరుతో రూ.10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. 18 నుంచి 23 ఏండ్ల మధ్యలో సంబంధిత డిపాజిట్‌పై వచ్చే వడ్డీ వారికి ఆర్థికంగా సహకరిస్తుందని, ఆ పిల్లలందరికీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి మంచి విద్యను అందిస్తామన్నారు. 23 ఏండ్లు నిండిన తర్వాత రూ.10 లక్షల ప్రీమియం మొత్తం వారికి అందుతుందన్నారు. అనంతరం ఆమె అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి రెవె న్యూ డివిజనల్ అధికారి విజయలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి లలి త, వెంకటేశ్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.