అబ్దుల్లాపూర్‌మెట్, మే 30 : పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికసాయం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రూ. 51వేలతో ప్రారంభమై రూ.75 వేలకు, రూ. 1.116 లక్షలకు ప్రభుత్వం పెంచిందని వివరించారు. జరిగిందన్నారు. 6 సంవత్సరాలుగా ప్రతి గ్రామానికి రూ.20 లక్షల నుంచి 30 లక్షల ఆర్థికసాయం అందజేశామని గుర్తు చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లు జూన్ చివరి వరకు అందుతాయన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న డబ్బులను అనవసరంగా ఖర్చు చేయకుండా మంచి పనుల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకుంటే 3 లేదా 4 నెలలు సమయం పడుతుందని లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలపడంతో ఎమ్మెల్యే స్పందించి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే చెక్కులు అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. పెండింగిలో ఉన్న 70 మంది మైనార్టీలకు షాదీముబారక్ చెక్కులు త్వరలోనే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ, జడ్పీటీసీ బింగిదాస్గౌడ్, పెద్దఅంబర్‌పేట మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్‌పాష, ఎండీవో మమతాబాయి, ఆర్ఐ సత్యనారాయణ, సర్పంచ్‌లు చెరుకు కిరణ్‌కుమార్‌గౌడ్, అంతటి యశోద, రంగయ్య, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పారంద సంతోష తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో అండగా సీఎం సహాయనిధి
ఇబ్రహీంపట్నం, మే 30 : ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండలంలోని తిప్పాయిగూడ గ్రామానికి చెందిన పొలమోని సత్తయ్యకు సీఎం సహాయనిధి నుంచి రూ.లక్ష మంజూరు చేయించారు. అట్టి ఎల్వోసీని సోమవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, ఎంసీటీసీ సుకన్య, సర్పంచ్ పాండు, నాయకులు వీరేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.