ధారూరు, మే 30: క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ధారూరు మండల పరిధిలోని రెండు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద క్రీడా ప్రాంగణాలు ఎంపిక చేసి పనులు ప్రారంభించినట్లు ధారూరు ఎంపీవో షఫిఉల్లా తెలి పారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ధారూరు మండల పరిధిలోని అంతారం, దోర్నా ల్ గ్రామాలను ఎంపిక చేశామని, పనులు కూడా పూర్తి అయ్యాయన్నారు. వచ్చే నెల 2న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. వాటితో పాటు మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలతో పాటు 14 అనుబంధ గ్రామాల్లోను క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలు పరిశీస్తున్నట్లు తెలిపారు.
చురుకుగా ఆట స్థలాల నిర్మాణ పనులు
బొంరాస్‌పేట, మే 30 : ప్రతి గ్రామంలో ఆడుకోవడానికి క్రీడా మైదానం నిర్మించాలన్న సీఎం ఆదేశాల మేరకు మండలంలో అధికారులు క్రీడా మైదానాల కోసం అనువైన స్థలా లను ఎంపిక చేస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాటికి మండలంలో రెం డు క్రీడా మైదానాలను ప్రారంభించాలన్న లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. మం డలంలోని రేగడిమైలారం, బొట్లవానితండాలలో ఎకరం చొప్పున స్థలాలను అధికారులు ఎంపిక చేసి కూలీలతో చదును చేయిస్తున్నారు. క్రీడా మైదానానికి గేటు, మైదానంలో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ తదితర ఆటలు ఆడుకోవడానికి కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం రేగడిమైలారం, బొట్లవానితండాలలో ఉపాధిహామీ ఏపీవో మల్లికార్జున్, ఈసీ ఇలియాస్ పర్యటించి పనులను పరిశీలించారు. జూన్ 2న రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలను ప్రారంభించడానికి సిద్ధం చేస్తామని వారు చెప్పారు.
మోమిన్‌పేట మండలంలో..
మోమిన్‌పేట,మే 30: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు గోవిందపురం గ్రామంలో చకచకా సాగుతున్నాయి. సొమవారం ఎంపీడీవో శైలజారెడ్డి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడా ప్రాంగణం ఏర్పాటు పనులు ము మ్మరంగా సాగుతున్నాయన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.హరితహారం కార్యక్రమం వరకు నర్సరీల్లోని మొక్కలు నాటడానికి సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈసీ వికాస్, పంచాయతీ కార్యదర్శి ఫిరోజ్, నాయకులు సాయిలు పాల్గొన్నారు.