రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్షలు శనివారం ముగిశాయి. ఈనెల 23న పరీక్షలు ప్రారంభం కాగా..శనివారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 47,490 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 47,112 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు.. హాజరు 99.20 శాతం నమోదైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు తెలిపారు. డీఈవో ఏడు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు 69 పరీక్షా కేం ద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. అయితే జిల్లాలో ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదుకాకపోవడం గమనార్హం.
వికారాబాద్ జిల్లాలో 14,212 మంది ..
పరిగి, మే 28: వికారాబాద్ జిల్లాలో శనివారం జరిగిన పదోతరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 14,212 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 14,441 విద్యార్థుల్లో 229 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి తెలిపారు. ప్రైవే ట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాల్లో 11 మంది విద్యార్థుల్లో ఏడుగురు హాజరు కాగా నలుగురు గైర్హాజరైనట్లు డీఈవో తెలిపారు.