కొత్తూరు రూరల్, ఆగస్టు 15 : పవన్గురు సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడీ సంఘం నాయకులు, భక్తులు ఆదివారం మండలకేంద్రం నుంచి మండలపరిధిలోని పెంజర్ల గ్రామంలోని 9 టెంపుల్స్ దేవాలయం వరకు పాదయాత్ర(కావడియాత్ర) నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో హరిద్వార్ నుంచి తీసుకువచ్చిన గంగాజలాన్ని కావడిలో మోసుకుని 9టెంపుల్స్లోని శివుడికి అభిషేకం చేస్తారు. అందులో భాగంగా గంగాజలాన్ని కావడిలో తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ముఖేశ్గోయల్, దినేశ్ అగర్వాల్, నీలేశ్ అగర్వాల్, దినేశ్ లావోటీ, రాజ్ అగర్వాల్, లీలాధర్ శర్మ, అరవింద్మిర్దా పాల్గొన్నారు.