ధారూరు, మే 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకో నర్సరీని ఏర్పాటు చేసి అందులో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ధారూరు మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు పెంచుతున్నారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా నెట్లను ఏర్పాటు చేశారు. జూన్ మాసం నాటికి ఐదులక్షల మొక్కలను సిద్ధంగా ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి పల్లె నర్సరీలో 17వేల మొక్కలు(టేకు, జామ, ఉసిరి, గచ్చకాయ, కానుగ, గూలబీ తదితర మొక్కలు) పెంచి జూన్ మాసంలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.
మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలు అల్లాపూర్, అల్లీపూర్, అంతారం, అంపల్లి, చింతకుంట, ధర్మాపూర్, ధారూరు, స్టేషన్‌ధారూరు, దోర్నాల్, ఎబ్బనూర్, గట్టేపల్లి, గురుదోట్ల, హరిదాస్‌పల్లి, కెరెళ్లి, కొండాపూర్‌కలాన్, కుక్కింద, కుమ్మరిపల్లి, మైలారం, మోమిన్‌కలాన్, మోమిన్‌ఖుర్దు, మున్నూర్ సోమారం, నాగారం, నాగసముందర్, నాగుసాన్పల్లి, నర్సపూర్, అవుసుపల్లి, పులిచింతల మడుగు తండా, రాజాపూర్, రాంపూర్ తండా, రుద్రారం, గడ్డమీదిగంగారం, తరిగోపుల గ్రామ పంచాయతీలలో 17వేల చొప్పున మొక్కలు పెంచుతున్నారు.
నర్సరీల్లో పెంచుతున్న వివిధ రంకాల మొక్కలు..
మండల పరిధిలోని పల్లె నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు మొత్తం 5.19లక్షలు: టేకు 1,01,800, మునగ 7,350, నీలగిరి 2,300, గుల్మార్ 34,782, రేన్ట్రీ 6,000, సుభాబి 1,500, ఈత 6,700, కానుగ 42,200, గచ్చకాయ 53,000, వేప 15,600, గంగరేణి 2,000, బాదం 15,500, చైనా బాదం 12,300, బురుగు 400, టేకోమా 12,900, సర్వీ 4,800, అల్లనేరేడు 6,250, చింత 10,900, శ్రీగంధం 500, జమ్మీ 1,000, కుంకుడు 2,000, మారెడు 1,000, మర్రీ 2,250, తదితర మొక్కలను పల్లె నర్సరీలలో పెంచుతున్నారు.
అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం
మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు షెడ్ నెట్లు ఏర్పాటు చేశాం. వర్షాకాలం నాటికి లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం చేస్తున్నాం. మొక్కలకు ప్రతి రోజూ రెండు పూటలు నీరు పోస్తున్నాం. ఎండా కాలంలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నాం. వచ్చే హరిత హారం కార్యక్రమం నాటికి గ్రామ నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తాం.
–శ్రీనివాస్, టీఏ ఉపాధి హామీ పథకం, ధారూరు
లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం
జూన్ మాసం నాటికి మండలం నుంచి ఐదు లక్షల మొ క్కలు సిద్ధం చేసి హరితహారం కార్యక్రమం నాటికి లక్ష్యం పూర్తి చేస్తాం.నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు పెంచుతు న్నాం. నర్సరీల ఏర్పాటుతో పల్లెల్లో వాతావరణం ఆహ్లా దకరంగా మారింది. హరితహారం కార్యకమ్రంపై ప్రజలకు కూడా అవగాహన పెరిగింది
– సురేశ్‌కుమార్ ఏపీవో, ఉపాధి హామీ పథకం, ధారూరు