కడ్తాల్, ఆగస్టు 15 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండలంలోని పోచమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరై మాట్లాడారు. యువకులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు.క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడలతో స్నేహబంధాలు పెంపొందుతాయన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అకాడమీలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించవచ్చని చెప్పారు. రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టును ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జడ్పీటీసీ దశరథ్నాయక్ను ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు అభినందించారు.
గెలిచిన జట్టుకు రూ.51,116 బహుమానం..
ఫైనల్ మ్యాచ్‌లో పోచమ్మగడ్డ తండా జట్టుపై గోవిందాయిపల్లి తండా జట్టు విజయం సాధించింది. గెలిచిన జట్టుకు రూ.51,116, రన్నరప్‌కు రూ.25,116లతో పాటు ట్రోఫిని ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సీఐ ఉపేందర్, ఎంపీడీవో రామకృష్ణ, ఎస్సై హరిశంకర్‌గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, హంశ్యామోత్యానాయక్, రాములునాయక్, యాదయ్య, కృష్ణయ్యయాదవ్, పూజాదేవానాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, మంజుల, కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరయ్య, నాయకులు చందోజీ, లాయక్‌అలీ, సంతోష్‌నాయక్, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, పత్యానాయక్, జైపాల్‌నాయక్, చంద్రమౌళి, నర్సింహాగౌడ్, జంగయ్యయాదవ్, గోపాల్, వినోద్, భీక్యానాయక్, శ్రీను, జగన్నాయక్, సాయిలాల్, మన్యానాయక్, మహేశ్, రవి పాల్గొన్నారు.