పెద్దఅంబర్‌పేట, మే 11: ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం హయత్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో మినీ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు దవాఖానలకు వెళ్తే అధిక డబ్బులు ఖర్చవుతున్నాయని.. ఆర్థికంగా లేని కుటుంబాలకు సైతం ఇబ్బందిలేకుండా సకాలంలో సమీపంలోనే ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నారని చెప్పారు. గతంలో సర్కారు దవాఖానల్లో 8 డయాగ్నొస్టిక్ హబ్‌లు ఉండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గత ఏడాది మరో పది కేటాయించారని పేర్కొన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లలో రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ, ఇతర 57 రకాల పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.
ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో నిరుపేదలకు సైతం సులువుగా సేవలు అందుతాయని పేర్కొన్నారు. వైద్యవిధాన పరిషత్‌ల పరిధిలోని దవాఖానలకు ఈ సెంటర్లను అనుసంధానం చేసి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సెంటర్లో వైద్య సిబ్బంది, టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారన్నారు. హయత్‌నగర్‌లోని ఈ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కేటాయించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భవిష్యత్‌లో ఎన్నో కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందని, ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పెద్దఅంబర్‌పేట మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.