వికారాబాద్, మే10: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలు సాధించాలని యువత పట్టుదలతో ఉంది. దీంతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఒత్తిడి తగ్గడంతో పాటు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తూ, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఆలోచన పరిజ్ఞానం పెంపొందుతుంది. సరైన సమయానికి నిద్రపోవడం, లేవడం పనులు చేసుకోవ డం వంటివి సాఫీగా సాగిపోతాయి. వ్యాయామంతో పాటు ప్రతి రోజు తాజా కూరగాయలతో తయారు చేసిన ఆహారంతో పాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్, పండ్లు ఎక్కువగా స్వీకరించాలి. మొలకెత్తిన గింజలు, ఆకు కూ రలు తీసుకోవాలి. ఎగ్‌వైట్, చేపలు తదితర ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. క్యా రెట్లు, బీట్ రూట్, కీరలు దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలి.
వ్యాయామంతో వ్యాధులు దూరం
ప్రతి రోజూ వ్యాయామం శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఒత్తిడి జయించి ప్రశాంత జీవితాన్ని గడుపుతారు. దీని వల్ల బీపీలు, షుగర్, గుండె సంబంధి వ్యాధులు దూరం అవుతాయి. శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలు కరిగి ఉత్సా హం పెరుగుతుంది. పౌష్టికాహారం ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు తినడం వలన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
– డాక్టర్ టి.ఆనంద్, చిన్నపిల్లల నిపుణులు, వికారాబాద్.
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సన్నద్ధం
జిమ్ చేయడం వలన శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉంటాం. శరీర ఆకృతి పెరగడంతో పాటు, ఫిట్నెస్ పెంచుకోవడం కోసం ఆసక్తి చూపుతున్నాం. ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే ఉద్యోగాల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. చదువుతో పాటు వ్యాయామం ఎంతో అవసరం. ఉద్యో గం సాధించాలనే లక్ష్యంతో నాతో పాటు ఎంతో మంది చేరుతున్నారు. -శ్రీకాంత్, వికారాబాద్
ఆరోగ్యం పదిలం..
దిన చర్యలో భాగంగా వ్యాయామం, జిమ్ తప్పని సరిగా చేయాలి. ప్రస్తుత సమాజంలో ప్రజలందరూ బిజీ బీజీ గా మారిపోయారు. సమయానికి భోజనం చేయలేక పోవడంతో పాటు, వ్యాయామం మరిచిపోయారు. దీని వల్ల ఎంతో మందికి అనారోగ్య సమస్యలు ఎదురై దవాఖానల పాలవుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆరో గ్యంగా ఉండటంతో పాటు ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
–రాఘవన్‌నాయక్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
సరైన సూచనలిస్తున్నాం..
జిమ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరిపై శ్రద్ధ తీసు కుంటున్నాం. వ్యామాయం చేసే వారికి సరైన విధంగా సలహాలు అందజేస్తాం. శక్తి సామర్థ్యాలను బట్టి వ్యాయామం, జిమ్ చేయడంతో పాటు పౌష్టికాహరం విషయంతో అవగాహన కల్పిస్తున్నాం. ఇక్కడ ఫిట్నెస్ను పెంచుకొని ఎంతో మంది కానిస్టేబుళ్లు ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం డాక్టర్లు, పోలీసులు, వ్యాపారులు, ఉద్యోగులు వ్యాయామానికి వస్తున్నారు.
– సద్దామ్, జిమ్ మాస్టర్ వికారాబాద్