ఆమనగల్లు, ఆగస్టు 15 : నేత్రదానం చేసి మరొకరికి చూపు ప్రసాదించాలని సింగిల్ విండో చైర్మన్ కొండల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూపు లేక లక్షల మంది ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేత్రదానంపై విరివిరిగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలంతా నేత్రదానాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది కంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులు శిబిరానికి వచ్చారు. ఆప్తామాలజిస్టులు వెంకటస్వామి, చంద్రశేఖర్ వారిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరంలో 30 మంది తీవ్ర కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించి వారిని ఐవోఎల్ పరీక్షలు నిమిత్తం హైదరాబాద్‌లోని పుష్పగిరి దవాఖానకు తరలించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రమేశ్, హెల్త్ విస్తరణ అధికారి తిరుపతిరెడ్డి, శివకుమార్, క్లబ్ పీఆర్వో పాల్గొన్నారు.