రంగారెడ్డి, మే 6(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ కారణంగా గత రెండేండ్లు పరీక్షలు జరుగలేదు. దీంతో అధికారులు ఈ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 156 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్, ఒకేషనల్ కలిపి 60,668 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 58,699 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు.. 1,969 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్‌బోర్డు నోడల్ అధికారి వెంక్యానాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు తొలిరోజు ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూ డా నమోదుకాకపోవడం గమనార్హం.
ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు సమయం కంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా దృష్ట్యా విద్యార్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు శానిటైజ్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశార క్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా పరిధిలోని ఆయా సెంటర్లలో 9,491 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 513 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా.. 8,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తాండూర్‌లో ముగ్గురు, కొడంగల్‌లో ఒకరు పరీక్షా సమయానికి కేంద్రానికి రాకపోవడంతో అధికారులు అనుమతించలేదు. జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.