పరిగి, మే 3: పరిగిలో మంగళవారం బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. పట్టణంలోని బసవేశ్వరుడి విగ్రహానికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పూలమాల వేశారు. బసవేశ్వరుడు సమాజంలో లింగ, వర్ణ, కుల వివక్షను రూపుమాపడానికి అహర్ని శలు కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. బసవేశ్వరుడి ఆశయాలు ఆచరణీయమైనవని పేర్కొన్నారు. అంతకుముందు వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో పరిగి పట్టణం లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం నాయకులు శివరాజ్, మాణిక్యం, శివలింగం, వీరన్న, జగదీశ్వర్, విజయలింగం, శ్రీశైలం, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
వీరశైవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
తాండూరు/ తాండూరు రూరల్ మే 3: వీరశైవ సమాజం ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతి వేడుకలు తాండూరు నియోజకవర్గంలో వైభవంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బస వేశ్వరుడి విగ్రహానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, రాజకీయ పార్టీల నేతలు, వీరశైవులు పూల మాలలు వేశారు. కందనెల్లి ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి రాష్ట్ర బీసీకమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, వైస్ ఎంపీపీ మధులత పూల మాలలు వేశారు. తాండూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర చిత్రపటా నికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో అధికారికంగా బసవేశ్వరుడి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరశైవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ పురప్రము ఖులు పాల్గొన్నారు. తాండూరు మండలం, బెల్కటూర్ గ్రామంలోని బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహి త్రెడ్డిలు హాజరయ్యారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మంజుల, సర్పంచ్ మధన్మోన్, ఎంపీటీసీ రాజమణి, పార్టీ అధ్యక్షుడు రాందాస్ తదితరులు ఉన్నారు
మహోన్నత వ్యక్తి బసవేశ్వరుడు
కొడంగల్, మే 3 ః సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి బసవే శ్వరుడని ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలతో పాటు ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు బసవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్య క్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్, వెంకట్‌రెడ్డి, రమేశ్, శంకర్ నాయక్, సర్పంచ్‌లు సయ్యద్ అంజద్, సాయిలు సావిత్రమ్మ, శంకర్‌నాయక్, గీతా ఠాకూర్, సీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
సమాజ మార్పునకు మార్గదర్శకుడు
వికారాబాద్, మే 3 : సమాజ మార్పునకు మార్గదర్శకుడు మహాత్మా బసవేశ్వరుడని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం బసవేశ్వరుని జయంతి సంద ర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూల మాలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా సమాజాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని తెలిపారు. బసవేశ్వరుడి ప్రవచనా లను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, సురేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.